TSPSC : పేపర్ లీక్ కేసును వాయిదా వేసిన హైకోర్ట్

TSPSC : పేపర్ లీక్ కేసును వాయిదా వేసిన హైకోర్ట్


టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసును హైకోర్ట్ మార్చి 21కి వాయిదా వేసింది. పేపర్ లీక్ కేసును సీబీఐకి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ  ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్  బల్మూరి వెంకట్ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు.  విచారణ సందర్భంగా ..  మార్చి 21కి పిటిషన్ ను వాయిదా వేయాలని బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది  కరుణాకర్ కోర్టును కోరారు.  సుప్రీం కోర్టు న్యాయవాది కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా వాదనలు వినిపిస్తారని కోర్టుకు తెలిపారు.  దీంతో కేసును వాయిదా వేసింది హైకోర్ట్. ఇదే కేసులో  నిరుద్యోగులు వేసిన పిటిషన్ ను మార్చి 21కి వాయిదా వేసింది హైకోర్ట్.

పేపర్ లీక్ కేసులో 9 మంది నిందితులను  సిట్  అధికారులు మూడో రోజు విచారిస్తున్నారు. నిందితులు ,పేపర్ ఎలా లీక్ చేశారు, ఎవరెవరికీ ఇచ్చారు, ఎంత లావాదేవీలు జరిపారనేదానిపై ఆరాదీస్తున్నారు.