TSPSC దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

TSPSC దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

టీఎస్ పీఎస్సీ దగ్గర పోలీసులు భారీగా మెహరించారు. మార్చి 15న ఓయూ విద్యార్థి సంఘాలతో పాటు, ప్రజా సంఘాలు ముట్టడికి పిలుపునివ్వడంతో ముందస్తు భద్రతా ఏర్పాట్లలో భాగంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పేపర్ లీకేజ్ ఘటనకు నిరసనగా టీఎస్పీఎస్సీను ముట్టడించనున్నారు.

పేపర్ లీకేజీలపై  టీఎస్పీఎస్సీ అధికారులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పరీక్ష రద్దు చేయాలా? వద్దా? అనేది తేల్చనున్నారు. పేపర్ లీక్ ఘటనలో 9 మంది నిందితులకు నాంపల్లి కోర్లు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాలు.. ప్రజా సంఘాలు, నిరుద్యోగులు టీఎస్ పీఎస్పీ దగ్గర నిరసనలకు పిలుపునిచ్చారు. ముందు రోజు జరిగిన పరిణామంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎవరూ అటువైపు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ పరిణామాలతో టీఎస్ పీఎస్సీ దగ్గర హై టెన్షన్ నెలకొంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. టీఎస్ పీఎస్సీ ఆఫీసును ముట్టడించి తీరతామంటున్నారు స్టూడెంట్స్..