ఓఎంఆర్ కి రాం రాం... టీఎస్పీఎస్సీలో అంతా కంప్యూటర్ పరీక్షలే..

ఓఎంఆర్ కి రాం రాం... టీఎస్పీఎస్సీలో అంతా కంప్యూటర్ పరీక్షలే..

పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో  పోటీ పరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. ఈ మేరకు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాబోయే రిక్రూట్ మెంట్ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించాలని ఆలోచిస్తోంది. టీఎస్పీఎస్సీ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో సాధ్యమైన చోట నిర్వహించాలని యోచిస్తోంది. ఎగ్జామ్ పేపర్ల తయారీ, భద్రత, ఇతర సాంకేతిక ఇబ్బందులు లేకుండా క్వషన్ బ్యాంకును రూపొందించి...అభ్యర్థుల సంఖ్య ఎంత ఉన్నా కూడా..విడతల వారీగా ఆన్ లైన్ పరీక్షలు జరపాలని కసర్తులు చేస్తోంది. అయితే టీఎస్పీఎస్సీలో ఇప్పటి వరకు 25వేల మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలను మాత్రమే కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తోంది. మిగిలిన పరీక్షలు ఆఫ్‌లైన్ మోడ్‌లో అంటే OMR ఆధారితంగా నిర్వహించబడుతున్నాయి. ఇక నుంచి  25వేలకు అభ్యర్థులు మించినా..ఈ పరీక్షలకు CBT  విధానాన్ని విస్తరించనుంది. పరీక్షలను విడతల వారీగా నిర్వహించి.., నార్మలైజేషన్ విధానం అమలు చేయాలని టీఎస్పీఎస్సీ  భావిస్తోంది. 

IBPS, SCC లెక్క..

SSC, IBPS, ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల తరహాలోనే నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్‌పీఎస్సీ ఆలోచిస్తోంది. అయితే ప్రస్తుతం ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. లక్షల సంఖ్యలో అభ్యర్థులకు ఒకేరోజున పరీక్షలు నిర్వహించడం కష్టమే. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు విడతల వారీగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఒక్కోసారి ఈ పరీక్షలు వారం రోజులపాటు జరుగుతున్నాయి. అయితే తెలంగాణలో ప్రస్తుతం 25వేల మంది అభ్యర్థులకు మాత్రమే ఒకేసారి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించేందుకు సదుపాయాలున్నాయి. ఇక ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లు ఉపయోగించుకుంటే రోజుకు దాదాపు 50వేల మంది వరకు ఒకేసారి పరీక్షలు నిర్వహించవచ్చు. అభ్యర్థుల సంఖ్య  ఇంకా పెరిగితే మాత్రం..విడతల వారీగా పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ ఆలోచన చేస్తోంది. 

కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ కోసం టీఎస్పీఎస్సీ ఒక సమగ్రమైన క్వషన్ బ్యాంకును సిద్దం చేయనుంది. ఇందులో భాగంగా  ప్రశ్నలు ప్రతీ సెషన్‌లో ఒకే విధంగా ఉండవు. ప్రతి సెషన్‌కు ప్రశ్నాపత్రం భిన్నంగా ఉంటుంది. దీంతో అభ్యర్థులు ప్రతి సెషన్‌లోని పరీక్షల సులభంగా రాయలేరు. కాపీ కొట్టలేరు.ప్రతీ సెషన్ లో పేపర్ కఠినంగా ఉండేందుకు టీఎస్ ఎంసెట్ తరహా  ప్రక్రియను అనుసరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ పరీక్షలు.. విధానంపై ఇప్పటికే అభ్యర్థుల్లో అవగాహన ఉండటంతో..ఆ దిశగా కసరత్తు చేస్తోంది.