
నందిపేట, వెలుగు : డీసీసీ ప్రెసిడెంట్ ఎంపికలో కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయానికి పార్టీ శ్రేణులు కట్టుబడి ఉండాలని ఏఐసీసీ పరిశీలకులు, బెంగులూరు ఎమ్మెల్యే రిజ్వాన్ హర్షద్ పేర్కొన్నారు. బుధవారం నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో ‘బీ’ బ్లాక్‌కు సంబంధించి నందిపేట, మాక్లూర్, డొంకేశ్వర్ మండల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక కోసం అభిప్రాయాలు సేకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్‌రెడ్డి, మూడు మండలాల అధ్యక్షులు మహిపాల్, భూమేశ్‌రెడ్డి, రవి ప్రకాశ్పాల్గొన్నారు.
ఆర్మూర్‌లో అభిప్రాయ సేకరణ..
ఆర్మూర్ : డీసీసీ ప్రెసిడెంట్ నియామకానికి బుధవారం ఆర్మూర్ లో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని ఆర్మూర్ టౌన్, రూరల్, ఆలూర్ మండల బ్లాక్ ఏ, పార్టీ సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్, ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్, పీసీసీ సెక్రటరీ పారిజాత నర్సింహ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆరేపల్లి మోహన్, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
అభిప్రాయ సేకరణ తర్వాత నివేదికను హైకమాండ్ కు నివేదిక పంపిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ మార చంద్ర మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు చిన్న రెడ్డి, పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, డేగ పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.