
కామారెడ్డిటౌన్, వెలుగు : బాధ్యత, సేవా భావంతో కూడినది పోలీస్ఉద్యోగమని ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి రూరల్ సర్కిల్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించిన తర్వాత మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి అధికారి శాంతిభద్రతల పరిరక్షణలో నిబద్దతో పని చేయాలన్నారు. గ్రేవ్ కేసుల్లో క్వాలిటీ ఎంక్వైరీ ఉండాలన్నారు. అవసరాన్ని బట్టి టెక్నికల్ సపోర్టు తీసుకోవాలన్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్టెడ్ పర్సన్ల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. ఆస్తి సంబంధిత నేరాలు చోటు చేసుకునే ఏరియాలను క్రైమ్ హాట్ స్పాట్స్‌గా గుర్తించి నిఘా పెంచాలని తెలిపారు. రూరల్ సీఐ రామన్, ఎస్సైలు ఉన్నారు.