
అమరావతి: ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ గురువారం (అక్టోబర్ 16) ఉదయం కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మోడీకి ఎయిర్ పోర్టులో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.
అనంతరం ఓర్వకల్లు నుంచి హెలికాప్టర్లో శ్రీశైలానికి బయలుదేరారు మోడీ. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీశైలం వెళ్లారు. శ్రీశైలం దర్శనం అనంతరం శివాజీ స్ఫూర్తికేంద్రాన్ని సందర్శించనున్నారు మోడీ. దాదాపు ఏడు గంటల పాటు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు మోడీ.