
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తును స్పీడప్ చేసింది. నిందితులిద్దరు ఏ1 ప్రవీణ్, ఏ2 రాజశేఖర్ రెడ్డిని టీఎస్పీఎస్సీలోనే విచారిస్తున్నారు సిట్ అధికారులు. టెక్నికల్ విషయాలపైన ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను ఆరాతీస్తున్నారు. ఏ ఏ సిస్టమ్ నుంచి పేపర్ డౌన్ లోడ్ చేశారని ప్రశ్నిస్తున్నారు. టీఎస్ పీఎస్సీలోని సిబ్బంది పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుల్లో మిగతా ఏడుగురిని హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇష్యూ అంతా ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, రేణుక చుట్టూనే తిరుగుతుంది. అయితే నిందితుల్లో ఏ1 ప్రవీణ్ కు, ఏ3 రేణుకకు ఎప్పటి నుంచి సంబంధం ఉంది.. గతంలో ఇంకేమైనా పరీక్ష పేపర్లను లీక్ చేశారా ? అనే కోణంలో విచారిస్తున్నారు. అదే విధంగా ఏ2 నిందితుడు రాజశేఖర్ రెడ్డి కూడా వారి బంధువులతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయించినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా సిట్ విచారిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో టెక్నికల్ సాక్ష్యాలు కీలకం కానున్నాయి.