ఏఈఈ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్

ఏఈఈ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్

హైదరాబాద్: 1540 ఏఈఈ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన కమిషన్ సమావేశంలో వివిధ విభాగాల్లో  ఖాళీగా ఉన్న మొత్తం 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల నోటిఫికేషన్‌ను ఆమోదించింది. ఇక ఖాళీల వివరాలకు వస్తే... మిషన్ భగీరథ విభాగంలో 302,  పీఆర్ అండ్ ఆర్ డీ ( సివిల్) విభాగంలో 211, ఎమ్ఏ అండ్ యూడీలో 147, టీడబ్ల్యూ లో 15, ఐ అండ్ కాడ్ లో 704, సివిల్ ఇంజనీరింగ్ లో 320, మెకానికల్ లో 84, ఎలక్ట్రికల్ లో 200, అగ్రికల్చర్ లో 100 జీడబ్ల్యూలో 3, టీఆర్ అండ్ బీ విభాగం (సివిల్) లో 145, టీఆర్ అండ్ బీ విభాగం (ఎలక్ట్రికల్) లో 13 పోస్టులు ఉన్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

ఈ నెల 22 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా... వచ్చే నెల 14న దరఖాస్తులకు తుది గడువు విధించారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్ సైట్ లో లాగిన్ కావొచ్చు.