టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి:టీఎస్పీటీఏ వినతి

టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి:టీఎస్పీటీఏ వినతి

సలహాదారు వేం నరేందర్ రెడ్డికి టీఎస్​పీటీఏ వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టీచర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని టీఎస్​పీటీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షౌకత్ అలీ, రోహిత్ నాయక్ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కోరారు. మంగళవారం హైదరాబాద్​లో వారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. 

ఏకీకృత సర్వీసు అమలు చేయాలని, లాంగ్వేజీ పండిట్ల పోస్టులను అప్​గ్రేడ్ చేయాలని, పదివేల పీఎస్ హెచ్​ఎం పోస్టులను మంజూరు చేయాలని కోరారు. ప్రతీ ప్రైమరీ స్కూల్​లో విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఇద్దరు టీచర్లను నియమించాలని, జీవో 472 ప్రకారం ఉర్దూ మీడియం స్కూళ్లలో టీచర్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ అంశాలపై వేం నరేందర్ రెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్​ సర్కారు.. ఉద్యోగుల ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు.