ఆదిలాబాద్ జిల్లాలో బస్సులో మహిళ ప్రసవం.. 

ఆదిలాబాద్ జిల్లాలో బస్సులో మహిళ ప్రసవం.. 

ఆదిలాబాద్: జిల్లాలో ప్రయాణికులను చేరవేస్తున్న ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన గర్బిణి మహిళ గమ్య స్థానం చేరకముందే పురుటినొప్పులు రావడం... కాసేపటికే కాన్పు కూడా జరిగిపోయింది. ఊహించని రీతిలో జరిగిన ఘటనకు బస్సు డ్రైవర్, కండక్టర్ తోపాటు... ప్రయాణికులు సహకరించగా విషయం తెలిసిన ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్సులో పుట్టిన బిడ్డకు జీవితాంతం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం  గుడిహత్నూర్ మండలం మాన్కపూర్ వద్ద ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవించిన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. 
పొరుగున్న ఉన్న మహారాష్ట్ర రాష్ట్రంలోని కిణ్వట్ కు చెందిన రత్నమాల నిండు గర్భిణి. ఆదివారం ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. అయితే బస్సులో గమ్యస్థానానాకి చేరకముందే రత్నమాలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. గుడిహత్నూర్ మండలం మన్కపూర్ వద్ద ఉండగా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. ఆ వెంటనే సుఖ ప్రసవం జరిగిపోయింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఆస్పత్రిలో ఉన్న రత్నమాల గురించి ఆరా తీసిన ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆమెకు తీపి కబురు అందించారు. ఆర్టీసీ బస్సులో పుట్టినట్లుగానే పరిగణిస్తూ.. పుట్టిన బిడ్డకు జీవితకాలం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు.