టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో స్పెషల్ టూరిస్ట్ బస్సు

టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో స్పెషల్ టూరిస్ట్ బస్సు

హైదరాబాద్: నగరంలోని చారిత్రక ప్రదేశాలను చూసేందుకు టీఎస్ఆర్​టీసీ ప్రత్యేక బస్సు సర్వీస్ ను కల్పించింది. ఈ బస్సుకు హైదరాబాద్​ దర్శినిగా నామకరణం చేశారు. ప్రతి శని, ఆదివారాల్లో రెండు సర్వీసులు నడవనున్నాయి. ఉదయం 8.30కి సికింద్రాబాద్​లోని ఆల్ఫా హోటల్​ నుంచి ఈ  టూరిస్ట్ బస్సులు బయలు దేరి.. నగరంలోని పలు చారిత్రక ప్రదేశాలు తిరుగుతూ తిరిగి రాత్రి 8 గంటలకి అదే స్పాట్​కు వస్తాయని అధికారులు చెప్పారు. ఇక ఛార్జీల విషయానికొస్తే మెట్రో ఎక్స్ ప్రెస్ లో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130, మెట్రో లగ్జరీ ఏసీ బస్సులో పెద్దలకు రూ.450, పిల్లలకు రూ. 340  ఛార్జీగా నిర్ణయించారు.

రూట్​ మ్యాప్​.. 

  • ఉదయం 8:30కు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి బస్సు సర్వీసు ప్రారంభం
  • ఉదయం 9 గంటల నుంచి10 వరకు బిర్లా మందిర్ దర్శనం
  • ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు చౌమొహల్లా ప్యాలెస్ సందర్శన
  • మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1:45 వరకు తారామతి బారాదరి రిసార్ట్స్ లో లంచ్ ( లంచ్ ఖర్చు ప్రయాణికులదే. ఆర్టీసీ తరపున 10 శాతం రాయితీ)
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు గోల్కొండ కోట సందర్శన
  • సాయంత్రం 4 గంటల నుంచి 5గంటల వరకు దుర్గం చెరువు పార్క్ సందర్శన 
  • సాయంత్రం 5:30 నుంచి 6 వరకు  కేబుల్ బ్రిడ్జ్ సందర్శన
  • సాయంత్రం 6:30 నుంచి రాత్రి 7:30 వరకు హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్క్ సందర్శన
  • రాత్రి 8 గంటలకు బస్సులు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్దకు చేరుకోనున్నాయి.