సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలి: సీతక్కకు టీఎస్ఎస్​ యూఎస్ వినతి

సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలి: సీతక్కకు టీఎస్ఎస్​ యూఎస్ వినతి

హైదరాబాద్, వెలుగు :  సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ అమ లు చేయాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం(టీఎస్​ఎస్​ యూఎస్) ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు మంత్రి సీతక్కతో పాటు విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశంను సంఘం ప్రతినిధులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. పెండింగ్​లోని జీతాలను రిలీజ్ చేయాలని కోరారు. 

కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగు లను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో కనీస వేతన స్కేలు అమలు చేస్తున్నారని, తెలంగాణలోనూ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు రూ.10 లక్షల జీవిత భీమా, రూ.5 లక్షల ఆరోగ్య భీమా అమలు చేయాలని కోరారు. కాగా, టీపీసీసీ మెంబర్ హర్షవర్ధన్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ యాదగిరి, రాష్ట్ర నేతలు రవీందర్, మాధవ్, రాజు, నాగార్జున, పాషా తదితరులు ఉన్నారు.