అథ్లెట్ నందినికి రూ.5 లక్షల నగదు

అథ్లెట్ నందినికి రూ.5 లక్షల నగదు

హైదరాబాద్, వెలుగు: ఆసియా గేమ్స్‌‌‌‌లో హెప్టాథ్లాన్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలిచిన తెలంగాణ యువ అథ్లెట్, గురుకుల స్టూడెంట్ అగసర నందినికి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సిషల్ ఎడ్యుకేషన్‌‌‌‌ సొసైటీ (టీఎస్‌‌‌‌డబ్ల్యూఆర్ఐఈఎస్) రూ. 5 లక్షల నజరానా అందించింది. మంగళవారం ధర్మపురిలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ ఆమెను ఘనంగా సన్మానించి చెక్‌‌‌‌ను అందజేశారు. 

నందిని భవిష్యత్తులో మరిన్ని పతకాలు గెలవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. మున్ముందు ప్రభుత్వం ఆమెకు అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ ఈ. నవీన్, స్పోర్ట్స్ ఆఫీసర్ రామ్‌‌‌‌ లక్షణ్ పాల్గొన్నారు. నందిని ప్రస్తుతం సంగారెడ్డిలోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో బీబీఏ చదువుతున్నది. మరోవైపు గోల్డ్ సహా నాలుగు మెడల్స్‌‌‌‌ గెలిచి హైదరాబాద్ తిరిగొచ్చిన యంగ్‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ ఇషా సింగ్‌‌‌‌కు శంషాబాద్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో మంత్రి మల్లారెడ్డి, ఒలింపిక్‌‌‌‌ సంఘం ప్రతినిధులు, మల్లారెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.