
న్యూఢిల్లీ: ఇండియా మెన్, విమెన్ టేబుల్ టెన్నిస్ జట్లు చరిత్ర సృష్టించాయి. ఇరు జట్లూ పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాయి. తమ వరల్డ్ ర్యాంకింగ్స్ ఆధారంగా సోమవారం రెండు జట్లు పారిస్ బెర్తులు దక్కించుకున్నాయి. గత నెల బుసాన్‌లో జరిగిన ఒలింపిక్స్ చివరి క్వాలిఫికేషన్ టోర్నీ అయిన వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్ ఫైనల్స్ తర్వాత టీమ్ ఈవెంట్లలో పలు బెర్తులు మిగిలాయి. 13వ ర్యాంక్‌లో ఉన్న విమెన్స్ టీమ్, 15వ ర్యాంక్‌లో ఉన్న మెన్స్ టీమ్ అర్హత సాధించాయి. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో టీటీని తిరిగి ప్రవేశపెట్టిన తర్వాత టీమ్ ఈవెంట్లలో ఇండియా జట్లు క్వాలిఫై అవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.