తప్పకుండా చర్యలుంటాయ్: పృథ్వీ వ్యవహారంపై TTD చైర్మన్

తప్పకుండా చర్యలుంటాయ్: పృథ్వీ వ్యవహారంపై TTD చైర్మన్

మహిళా ఉద్యోగితో ఫోన్ లో మాట్లాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు, ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. దీనిపై విచారణకు ఆదేశించామని ఆయన తెలిపారు.

ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని , ఎవరో కావాలనే ఇందులో ఇరికించారని పృథ్వీ తనకు చెప్పినట్టు వైవీ సుబ్బారెడ్డి  తెలిపారు. ఆదివారం ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ..  దీనిపై విచారణకు విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించానన్నారు. నివేదిక అందిన తర్వాత సీఎంకు తెలిపి.. ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. SVBC ఛానల్‌ అంటే TTD లో భాగమేనన్నారు. ఎస్వీబీసీ ఛానల్‌ను ఎంతో మంది భక్తులు వీక్షిస్తారన్నారు. నివేదిక వచ్చాక తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు.

Related news: నన్ను టార్గెట్ చేశారు..ఉద్యోగినితో ఫోన్ కాల్ పై పృథ్వీ రియాక్షన్