మే 3 వ‌ర‌కూ తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాలు నిలిపివేత‌

మే 3 వ‌ర‌కూ తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నాలు నిలిపివేత‌

కరోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు కేంద్ర‌ ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ను పొడిగించ‌డంతో … తిరుమ‌ల‌ శ్రీ‌వారి ఆల‌యంలో వచ్చే నెల మూడు వరకు భక్తులకు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తుల్ని దర్శనానికి అనుమతించకపోయినా.. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలన్నీ ఏకాంతంగా కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే ఏప్రిల్ 14వరకూ శ్రీవారి దర్శనాలను నిలిపివేసిన టీటీడీ.. ఈ నిలిపివేతను మే 3 వరకూ పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కార‌ణాల దృష్ట్యా తిరుమల వెంకన్న దర్శనానికి భక్తుల్ని అనుమతించడం లేదు. అలాగే కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. లాక్‌డౌన్ పొడిగించడంతో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

TTD continues suspension of srivari darshan till may 3