శ్రీవారి దర్శన టికెట్ల కోటాను పెంచింది టిటిడి

శ్రీవారి దర్శన టికెట్ల కోటాను పెంచింది టిటిడి

తిరుపతి: శ్రీవారి దర్శన టికెట్ల కోటాను పెంచింది టిటిడి. గత కొంత కాలంటా శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న నేపధ్యంలో భక్తులను నిరాశకు గురిచేయకుండా కోటా టికెట్లను పెంచింది దేవస్థానం. ప్రస్తుతం రెండవదశ కరోన వ్యాప్తి తగ్గడంతో ఇవాళ్టి నుండి రోజుకు మూడు వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అదనంగా పెంచింది. కరోనా రెండవ దశవ్యాప్తి ప్రారంభం అయిన వెంటనే గత మార్చి నెల నుండి దర్శనాల సంఖ్య గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు నెలల పాటు 5 వేల టికెట్లు మాత్రమే టికెట్లు కేటాయిస్తూ వచ్చింది. ఉచిత దర్శనాలు పూర్తిగా నిలిపివేసిన టీటీడీ మళ్లీ దర్శనాలను పెంచే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 28 నుండి ఆగస్టు 30 వరకు రోజు మూడు వేలు టికెట్లు పెంచడంతో దాదాపు  లక్ష పదివేల టికెట్లు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. 
మొరాయిస్తున్న సర్వర్.. దొరకని టికెట్లు
దర్శనం కోటా టికెట్లు పెంచడంతో భక్తులు సంతోషపడినా వేచిచూడాల్సిన పరిస్థితి సృష్టించింది. బుధవారం అన్ లైన్ లో విడుదల చేయ్యాల్సిన  టికెట్లు సాంకేతిక కారణాల వల్ల విడుదల కాలేదు. టిటిడి సాఫ్ట్ వేర్ లో సమస్యల కారణంగా దర్శన టికెట్లు అందుబాటులోకి రాలేదు. టిటిడి అధికారులు సమస్యను పరిష్కరించి, తిరిగి మద్యహ్నం మూడు గంటలకు ఆన్ లైన్ లో విడుధల చేశారు. ఎక్కువ మంది భక్తులు ఒకేసారి హిట్స్ కొట్టడంతో సర్వర్లు కూడా పనిచెయ్యని పరిస్థితి నెలకొంటుందని టీటీడీ వివరణ ఇచ్చింది. అధికశాతం మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురుస్తున్నారని అర్థం అవుతోందని టీటీడీ పేర్కొంది.