ఎవరైతే మాకేంటీ.. డోంట్ కేర్ అంటున్న ఎలన్ మస్క్

ఎవరైతే మాకేంటీ.. డోంట్ కేర్ అంటున్న  ఎలన్ మస్క్

ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా అందర్నీ గంపగుత్తగా లేపేశాడు. డబ్బులు కట్టకపోతే ఎవరైతే మాకేంటీ అన్నట్లు సీఎం అకౌంట్స్ వెరిఫికేషన్ బ్లూ టిక్ తొలగించేశారు. వాళ్లంటే మనుషులు లెక్క చూసినా.. దేవుడిని కూడా వదల్లేదు ఎలన్ మస్క్.  ప్రపంచంలోనే పుణ్యక్షేత్రాల్లో ప్రముఖమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెరిఫికేషన్ సైతం పోయింది. అదే విధంగా తిరుమల దేవస్థానానికి చెందిన ఇతర ప్రముఖుల అకౌంట్స్ సైతం వెరిఫికేషన్ నుంచి ఔట్ అయ్యాయి. మన వేంకటేశ్వరస్వామి అంటే ఎలన్ మస్క్ కు తెలియకపోచ్చు.. పోప్ ప్రాన్సిన్స్ ట్విట్టర్ అకౌంట్ కు బ్లూటిక్ తొలగించేశారు. పోప్ అంటే క్రైవస్తుల ఆరాధ్యం. దేవుడి లెక్క కొలుస్తారు అందరూ. అలాంటి మహిమాన్వితుని అకౌంట్స్ కు డబ్బులు కట్టలేదని బ్లూ టిక్ తొలగించటం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

దేవుళ్లు కనిపించకపోయినా పర్వాలేదు ఎలన్ మస్క్ కు.. ఐటీ దిగ్గజం.. ఇవాళ ట్విట్టర్ లాంటి ఎన్నో సంస్థలకు టెక్నాలజీ డెవలప్ మెంట్ కు మార్గం చూపించినా.. రూటు వేసిన బిల్ గేట్స్ అకౌంట్ కు కూడా బ్లూటిక్ తొలగించటం విశేషం. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా. . హోదాలు చూడకుండా అందరినీ ఒక్కగాటిన కట్టి లేపేయటం అంటే.. అది ఎలన్ మస్క్ కే సాధ్యం అయ్యిందంటున్నారు నెటిజన్లు. 

గతంలో ట్విట్టర్ లో మార్కెటింగ్ టీమ్స్ ఉండేవి. ప్రతి దేశంలో ప్రధాన నగరాల్లో ఆఫీసులు ఉండేవి. ప్రముఖులు ఏంటీ.. వాళ్ల స్థాయి ఏంటీ.. వాళ్ల మార్కెటింగ్ ఏంటీ అనే అంచనాతో బ్లూటిక్ వెరిఫికేషన్ కేటాయించటం జరిగింది. ఇప్పుడు ట్విట్టర్ లో మార్కెటింగ్ టీమ్స్ మొత్తాన్ని లేపేశాడు.. 8 వేల 500 మంది ఉద్యోగులను.. 15 వందల మందికి తీసుకొచ్చాడు. అన్ని పనులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నాడు. డబ్బులకు సింగిల్ అకౌంట్ పెట్టేశాడు.. డబ్బులు కట్టండి.. బ్లూటిక్ తీసుకోండి అనే సింగిల్ అజెండాతో ముందుకెళుతున్నాడు ఎలన్ మస్క్. అది దేవుడు అయినా మనుషులు అయినా ఒక్కటే అంటున్నాడు ట్విట్టర్ ఓనర్. 

ఎంతైనా మస్క్ మస్కే.. వ్యాపారం చేయటంలో దిట్ట.. టెక్నాలజీని వాడుకోవటంలోనూ అదే స్థాయిలో చూపిస్తున్నాడు. ఎవరికి అవసరం ఉంటే వాళ్లు కొనుక్కోవటమే.. అది చిన్నోడు అయినా ఒకటే.. పెద్దోడు అయినా ఒకటే.. డబ్బులు.. డబ్బులు.. డబ్బులు.. పైసానే పరమాత్మగా సోషల్ మీడియాను మార్చేసిన ఘనత కూడా మస్క్ సొంతం..