తిరుమలలో స్టీల్ హుండీలు.. ఇకపై మూడు వైపులా కానుకలేయొచ్చు

తిరుమలలో  స్టీల్ హుండీలు.. ఇకపై మూడు వైపులా కానుకలేయొచ్చు

తిరుమలలో ఇకపై పాత కానుకల హుండీలు మీకు కనిపించకపోవచ్చు. భద్రత తదితర కారణాల వల్ల పాత వాటి స్థానాల్లో కొత్తగా స్టీల్ తో తయారు చేసిన హుండీలను ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 

ఇందులో భాగంగా టీటీడీ ఆఫీసర్లు జులై 29న శ్రీ వేంకటేశ్వరాలయంలోకి 5 అడుగుల స్టీల్​ హుండీని ప్రయోగాత్మకంగా తీసుకెళ్లి పరిశీలించారు. ప్రస్తుతానికి మరి కొన్ని చోట్ల భారీ గంగాళాలు ఉంచి అందులో భక్తులు కానుకలు సమర్పించేలా హుండీలు, ఇత్తడి హుండీలు ఏర్పాటు చేసి ఉపయోగిస్తున్నారు. 

అయితే పలు హుండీలలో భక్తులు నగదు వేస్తున్న సమయంలో లోనికి చేయి పెట్టి దొంగతనం చేసిన ఘటనలు జరిగాయి. ఇలాంటి వాటికి తావివ్వకుండా స్టీలు హుండీలు సిద్ధం చేస్తున్నారు. వీటికి 3 వైపుల కానుకలు సమర్పించొచ్చు.  

మధ్యలో ఓ ఇనుప రాడ్​ని ఏర్పాటు చేశారు. దీంతో భక్తుల చెయి పూర్తిగా దూరే ఛాన్స్ లేదు.  ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న వీటి వినియోగం ఈజీగా ఉంటే అన్ని స్థానాల్లో వీటినే ఏర్పాటు చేసే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెప్పారు.