
లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు, పేద ప్రజలు ఆకలితో అలమటిస్తుండడం చూసి, వారిని ఆదుకునేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో వారంతా ఆహారం కోసం ఇబ్బంది పడకూడదని, వారి ఆకలి తీర్చేందుకు జిల్లాకు రూ. కోటి చొప్పున రాష్ట్రంలోని 13 జిల్లాలకు రూ.13 కోట్ల విరాళాన్ని అందించనుంది. ఈ మేరకు ప్రతి జిల్లా కలెక్టర్లకు ఈ నిధులు అందజేసేలా నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
బుధవారం టీటీడీ ఛైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షలో అన్నదానం ట్రస్టు నుంచి జిల్లాకు రూ. కోటి చొప్పున విరాళమివ్వాలని నిర్ణయించారు. అలాగే లాక్‌డౌన్ గడువును పొడిగించడంతో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని మే 3వ తేదీ వరకు నిలిపివేసినట్లు సింఘాల్ తెలిపారు.