నోరెత్తొద్దు.. నోరు మూసుకో : ఢిల్లీ మెట్రోలో లేడీస్ ఫైటింగ్

నోరెత్తొద్దు.. నోరు మూసుకో : ఢిల్లీ మెట్రోలో లేడీస్ ఫైటింగ్

ఢిల్లీ మెట్రో నిత్యం రకరకాల వార్తలతో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఇద్దరు మహిళల మధ్య కీచులాటకు  సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవ పడటం మొదలుపెట్టారు. ఒకరిపై ఒకరు అరుచుకున్నారు

ఢిల్లీ మెట్రోలో సీటు విషయంలో ఇద్దరు మహిళలు అరుచుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక మహిళ  తన కుమార్తెతో పాటు ప్రయాణిస్తుండగా...  మరొక మహిళ  ఆమెపై అరవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.   ఒకరి కొకరు వేళ్లు చూపించుకుంటూ నోర్మూసుకో అంటూ  అరుచుకున్నారు.  కనీసం తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని అని కూడా ఆలోచించడం లేదు.  వీరి గొడవను ఆపేందుకు ప్రయాణికులు జోక్యం చేసుకుంటుండగా  కుమార్తె తల్లి  అతడిని వెనక్కు తీసుకెళ్లింది.  తరువాత మరొక మహిళ వచ్చి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేసినట్టు వీడియోలో ఉంది.  The DV Warrior (Parody) అనే ట్విట్టర్ ఖాతా నుంచి  పోస్ట్ చేయబడింది.  

 కొంతకాలంగా  ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తుంది.    డ్యాన్స్ చేస్తున్న వీడియోలు, మెట్రోలో వాదించుకోవడం, కొట్లాడుకోవటం, డ్యాన్సులు, పాటలు పాడటం, ముద్దులు పెట్టుకుంటూ, అసభ్యకరమైన సినిమాలు చూసే వారి వీడియోలు వైరల్ అవుతున్నాయి.  ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో కనీసం పిల్లలున్నారని కూడా ఆలోచించకుండా వాగ్వాదానికి దిగారు.  మెట్రో అధికారులు గొడవలకు దూరంగా ఉండాలని ప్రయాణికులను కోరుతున్నా... వారిలో ఎలాంటి మార్పు రావడం లేదు.  మరి ఇలాంటి సమస్యలకు అధికారులు ఎలా చెక్ పెడతారో వేచి చూడాలి.