
నాని హీరోగా శివ నిర్వాణ రూపొందించిన ‘టక్ జగదీష్’ ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతోంది. నిన్న ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. నాని మాట్లాడుతూ ‘ఫ్యామిలీ ఎమోషన్స్‌ని, రిలేషన్స్‌ని శివ ఎంత బాగా హ్యాండిల్ చేస్తాడో గత చిత్రాల్లో చూశాం. యాక్షన్, ఇంటెన్స్ డ్రామాపై కూడా తనకున్న గ్రిప్‌ని ఇందులో చూస్తారు. ఎమోషన్స్ నిండుగా ఉన్న ఈ మూవీ పండక్కి వస్తుండడం హ్యాపీ. ఎక్కడ రిలీజ్ చేసినా ప్రేక్షకులు చూస్తారు. కానీ ఒక్కో సినిమాకీ ఒక్కో ఎక్స్‌పెక్టేషన్, బడ్జెట్, కాలిక్యులేషన్ ఉంటాయి. అందుకే ఓటీటీకి వెళ్లాల్సి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. కానీ నా సినిమాలు ఆపేస్తామన్నారు. నన్ను బయటివాడిని చేశారనే బాధ తప్ప, వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోగలను. కానీ నేనూ వాళ్లలో ఒకడినే. పరిస్థితులు బాగు న్నప్పుడు నేను థియేటర్స్‌కి వెళ్లకపోతే, అప్పుడు మరెవరో కాదు.. నన్ను నేనే బ్యాన్ చేసుకుంటాను’ అన్నాడు. డైరెక్టర్‌తో పాటు నిర్మాతలు సాహు, హరీష్, హీరోయిన్ రీతూవర్మ, తిరువీర్, ప్రవీణ్ పాల్గొన్నారు.