తులసిలో అనేక వ్యాధులను నయం చేస్తూ, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఇన్ని గుణాలున్న తులసిని ఇంట్లోనే పెంచడం ద్వారా.. ప్రతి రోజూ తులసి ఆకులను వాడుకోవచ్చు.
- తులసి ఆకు రసాన్ని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తే కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది.
- తులసి వేరును, శొంఠినీ సమ తూకంలో తీసుకుని ఈ రెంటినీ మెత్తగా నూరి, కుంకుడు గింజ పరిమాణంలో ఉండలా తయారు చేయాలి. వీటిని రోజుకు ఒకటి చొప్పున ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి. ఇలా చేస్తే, చాలా రకాల చర్మ వ్యాధులు తగ్గి పోతాయి.
- తులసి, వెల్లుల్లిని నూరి, వాటి రసాల్ని చెవిలో వేస్తే చెవి పోటు తగ్గుతుంది.
- ఒక చెంచా తులసి గింజలను ఒక కప్పు నీటిలో వేసి కాసేపు ఉంచి తాగితే, మూత్రం సాఫీగా రావడంతో పాటు కాళ్ల వాపులు కూడా తగ్గుతాయి.
- ప్రతి రోజూ నాలుగైదు తులసి ఆకులు నమిలి మింగితే మానసిక ఆందోళనలు కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయ్యింది. మరింకెందుకాలస్యం భక్తిగా తులసి మొక్కను ఇంట్లో పెంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి..
