ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశా: తుమ్మల

ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశా: తుమ్మల

తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. తన పదవి కాలంలో గ్రామసీమలు, రైతులు అడిగిన పనులను పూర్తి చేశానన్నారు. నీతినియమాలతోనే అభివృద్ధి పనులు పనిచేశానని చెప్పారు. అనేక ఉపనదులపై చెక్ డ్యాంలు పూర్తి చేసి పంటలు సస్యశ్యామలం చేశామన్నారు. వేల కోట్లతో జాతీయ రహదారులు సాధించానని.. ప్రతి గ్రామానికి మంచినీరు అందించానన్నారు. జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేశానని..తన 40 ఏళ్ల  రాజకీయ జీవితం  సంతృప్తినిచ్చిందన్నారు.  

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఖమ్మం జిల్లా అభివృద్ధిని చూస్తున్నారని తుమ్మల చెప్పారు.  ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తన ఏకైక లక్ష్యమని  అన్నారు. మిషన్ కాకతీయ , మిషన్ భగీరథతో అన్ని గ్రామాలకు మంచినీళ్లు సరఫరా చేశామన్నారు. గోదావరి జలాలతో పాలేరు ప్రజల పాదాలు కడిగి రుణం తీర్చుకుంటానని అన్నారు.