- శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ నేషనల్ మేళా ప్రారంభం
మాదాపూర్, వెలుగు: చేనేత, హస్త కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని శిల్పారామంలో గాంధీ శిల్ప బజార్ నేషనల్ మేళాను సోమవారం ఆయన చీఫ్ గెస్టుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేళాలో ఏర్పాటు చేసిన హ్యాండీ క్రాఫ్ట్స్ స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, అధికారులు పాల్గొన్నారు.
