- ఈఏసీ కన్వీనర్ వైపీ సింగ్‌తో సంప్రదింపులు జరపండి
- మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు విజ్ఞప్తి
- సీతారామ సాగర్‌లోని జూలూరుపాడు టన్నెల్ పనులు స్పీడప్ చేయండి
- ప్యాకేజ్ 1, 2, 7, 8లలో కెనాల్స్‌కు బదులు ప్రెషరైజ్డ్ పైపులు వాడాలి
- ఖమ్మం జిల్లాలో వరద నుంచి కాపాడేలా రక్షణ గోడలు నిర్మించాలని రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: సీతమ్మసాగర్ ప్రాజెక్టు అనుమతుల కోసం ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) కన్వీనర్వైపీ సింగ్‌తో సమావేశం నిర్వహించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు. పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన జూలూరుపాడు టన్నెల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రా సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే పథకంలోని ప్యాకేజీ-11 పరిధిలో పంప్‌హౌస్-4 నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, వాటిని గడువులోగా పూర్తి చేయాలన్నారు. బుధవారం మంత్రి తుమ్మల సెక్రటేరియెట్‌లో మంత్రి ఉత్తమ్‌తో సమావేశమై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 15 పనులను స్పీడప్ చేయాలని చేశారు.
సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌లోని ప్యాకేజీలు 1, 2, 7, 8 పరిధిలో గ్రావిటీ కాలువలకు బదులుగా ప్రెషరైజ్డ్ పైప్డ్ ఇరిగేషన్ నెట్‌వర్క్ విధానాన్ని అమలు చేసే wఅక్టోబరు 17న ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. వీటికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి పైపుల ద్వారా సాగునీటి సరఫరా వ్యవస్థ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అశ్వారావుపేట నుంచి దబ్బతోగు, ఆసుపాక గ్రామాల్లోని చిన్న నీటిపారుదల చెరువులకు నీరందించే వెంకమ్మ చెరువు వరద ప్రవాహ కాలువ పనుల ఫైల్ పెండంగ్‌లో ఉందని, వాటికి త్వరగా ఆమోదం తెలపాని కోరారు.
పెద్దవాగు కట్టకు శాశ్వత మరమ్మతులు చేయాలని, ఏపీ రూ.3.40 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. ఆ ఫైల్ మన ప్రభుత్వం దగ్గరే పెండింగ్ఉందని చెప్పారు. పీఎం సూర్య సరోవర్ యోజన కింద సాగునీటి రిజర్వాయర్లపై ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు త్వరమైన అనుమతులు మంజూరు చేయాలన్నారు.
