టర్కీ,సిరియాలో శవాల కుప్పలు..24వేల మంది మృతి

టర్కీ,సిరియాలో  శవాల కుప్పలు..24వేల మంది మృతి

శిథిలాల దిబ్బలు.. బాధితుల రోదనలు.. సాయం కోసం ఎదురుచూపులు.. టర్కీ, సిరియాలో ఎక్కడా చూసినా హృదయ విదారక పరిస్థితులే కన్పిస్తున్నాయి. శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతుంటడం  అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.  భూకంపం ప్రభావంతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గంట గంటకూ.. పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 24వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. 

మొత్తం 95 దేశాలు టర్కీ సిరియాను ఆదు కునేందుకు ముందుకొచ్చాయి. 60 దేశాలకు చెందిన 7వేల మంది సిబ్బంది టర్కీలో రెస్క్యూ పనుల్లో నిమగ్నమయ్యారు. మరో 19 దేశాల నుంచి రెస్క్యూ టీంలు టర్కీకి వస్తున్నాయి. టర్కీలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో సేవలందించేందుకు ఇండియా 'ఆపరేషన్ దోస్త్' చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్ప టికే రెస్క్యూ టీమ్ ను, ఆర్మీ డాక్టర్లను, మందులు, అత్యవసర సామగ్రిని కేంద్ర ప్ర భుత్వం టర్కీకి పంపించింది. టర్కీ ప్రజలకు ఇండియా ఎప్పటికీ అండగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు.