జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలి

జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలి

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో రాయితీ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సలీం డిమాండ్ చేశారు. సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ లో కలెక్టర్ నారాయణరెడ్డి,డీఈవో సుశీంధర్ రావు కు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

అనంతరం తెలంగాణ మీడియా అకాడమీ, టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా సహకారంతో నిర్వహిస్తున్న  జర్నలిస్టుల రెండు రోజుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి రావాలని కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కొనియాల భాస్కర్, చెక్కల శ్రీశైలం, రాఘవేందర్ యాదవ్, ప్రదీప్, పాండు, బాలు, భాస్కర్, పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.