జర్నలిస్టుల సంక్షేమానికి కృషి: శంకర్ దయాళ్ చారి

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి: శంకర్ దయాళ్ చారి

రామాయంపేట, వెలుగు: ఐక్యంగా ఉండి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని టీయూ డబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ చారి సూచించారు. ఆదివారం రామాయంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పట్టణంలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు.

 జర్నలిస్టులందరూ ఏకతాటిపై ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఐజేయూ సభ్యులు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, అశోక్, జిల్లా నాయకులు  రమేశ్ గౌడ్, నగేశ్, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ భైరవరెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగం, ప్రభాకర్, యాదగిరి, నారాయణ ఇతర సభ్యులు పాల్గొన్నారు