తిరుపతిలో టీవీ నంది అవార్డుల వేడుక

తిరుపతిలో టీవీ నంది అవార్డుల వేడుక

గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డులను త్వరలోనే ప్రదానం చేస్తామని, 2025 నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఇస్తామని ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ ప్రకటించారు. తెలుగు టెలివిజన్ 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ ‘తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో నవంబర్ లేదా డిసెంబర్‌‌‌‌లో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించబోతున్నాం’ అని చెప్పారు.

ఏపీలో స్టూడియోల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని, స్థానిక ఆర్టిస్టులకు ప్రాధాన్యత, హెల్త్ ఇన్సూరెన్స్‌‌లు, పెన్షన్లు, షూటింగులకు సబ్సిడీలను  టీవీ రంగ ప్రతినిధులు కోరారు. ఈ అంశాలపై కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  ఎఫ్డిసి సభ్యులు బుర్ర సాయి మాధవ్, మీర్, నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.