
చెన్నై: కరూర్‌లో తొక్కిసలాట ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత విజయ్ సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషాదం భరించ లేనిదని, మాటలకు అందనిదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘నా గుండె బద్దలైపోయింది. భరించలేని, మాటల్లో చెప్పలేని బాధ, దు:ఖంలో ఉన్నా. ఈ ఘటనలో మరణించినవారికి సంతాపం తెలియజేస్తున్నా. ఆప్తులను కోల్పోయిన నా సోదరులు, సోదరీమణులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా” అని విజయ్ ట్వీట్ చేశారు.
కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 27) రాత్రి కరూర్ జిల్లా కేంద్రంలో టీవీకే అధినేత విజయ్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌కు జనం, విజయ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పోలీసుల నుంచి పర్మిషన్ 10 వేల మందికి తీసుకుంటే ఈ సమావేశానికి దాదాపు లక్ష మంది హాజరైనట్లు సమాచారం. దీంతో జనం రద్దీ ఎక్కువై తొక్కి సలాట జరిగింది.
ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. 11 మందికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తు్న్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు తొక్కి సలాట ఘటనకు బాధ్యుడిగా కరూర్ జిల్లా టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ తొక్కిసలాటలో 38 మంది చనిపోయిన ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.