హైదరాబాద్ సుచిత్రలో ఇళ్లలో టీవీలు, ఏసీలు పేలిపోయాయి.. ఏం జరిగిందంటే.. ?

హైదరాబాద్ సుచిత్రలో ఇళ్లలో టీవీలు, ఏసీలు పేలిపోయాయి..  ఏం జరిగిందంటే.. ?

హైదరాబాద్ లోని సుచిత్రలో వసంత్ విహార్ కాలనీలోని ఓ ఇల్లు అది.. దసరా పండగ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. హాలిడేస్ ఇంకా పూర్తవ్వలేదు కాబట్టి ఇల్లంతా పిల్లలు, బంధువులతో సందడిగా ఉంది. ఫ్యామిలీ అంతా టీవీ చూస్తూ రిలాక్స్ అవుతున్నారు... ఇంతలో ఎదో పెద్దగా పేలిన శబ్దం, ఇంట్లో టీవీ సడన్ గా పేలిపోయింది.. బెడ్ రూమ్ లో ఏసీ కూడా పేలిపోయింది. దీంతో ఏం జరుగుతుందో తెలీక టెన్షన్ పడ్డారు ఇంట్లో వాళ్ళు. అప్పటిదాకా సరదాగా ఆడుకుంటున్న పిల్లలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. టీవీ, ఏసీ ఉన్నట్టుండి ఎందుకు పేలిపోయాయో అర్థంకాని పరిస్థితి.. ఇరుగు పొరుగు ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి. శుక్రవారం ( అక్టోబర్ 3 ) హైదరాబాద్ లోని సుచిత్రలో జరిగింది ఈ ఘటన.. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

హైదరాబాద్ లోని సుచిత్రలో వసంత్ విహార్ కాలనీలో ఉన్న మూడు ఇళ్లలో ఒక్కసారిగా టీవీలు, ఏసీలు పేలిపోయాయి. ఏం జరుగుతుందో తెలియక టెన్షన్ పడ్డారు జనం. హై వోల్టేజ్ తో పేలిపోయాయని అనుకున్నారు అంతా.. అలాగే వదిలేస్తే మిగతా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా పేలిపోతాయేమోనని ఫ్రిడ్జ్, చిమ్ని, గీజర్ వంటివాటిని డిస్కనెక్ట్ చేశారు. విషయం గురించి విద్యుత్ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోకపోవడంతో భయంతో వణికిపోయారు జనం.

అయితే..టీవీలు, ఏసీలు పేలిపోవడానికి లో వోల్టేజ్, హై వోల్టేజ్ కారణం కాదని తేలింది. విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్లు ఎర్త్ అవ్వడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిసింది.