ట్విట్టర్‌కు కొత్త సీఈవో.. మీమ్స్‌తో క్రియేటివిటీని బయటపెట్టిన నెటిజన్స్

ట్విట్టర్‌కు కొత్త సీఈవో.. మీమ్స్‌తో క్రియేటివిటీని బయటపెట్టిన నెటిజన్స్

ట్విట్టర్‌కు కొత్త సీఈవోను రానున్నట్లు టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. NBC యూనివర్సల్ ఎగ్జిక్యూటివ్ లిండా యాకారినో.. ఈ  మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌కి కొత్త నాయకురాలిగా రాబోతుందంటూ పలు మీడియాల్లోనూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటన వెలువడగానే సోషల్ మీడియాలో ఈ వార్తకు సంబంధించి అనేక మీమ్స్ వైరల్ అవుతున్నాయి. కొత్త సీఈవోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తూ పలు పోస్టులతో ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. అందులో కొందరు తమ సృజనాత్మకతను ఉపయోగించి ఫన్నీ అండ్ ఇంట్రస్టింగ్ చిత్రాలను రూపొందించారు.

క్రియేటివ్ థింకింగ్ తో రూపొందించిన ఈ చిత్రాల్లో ఎలాన్ మస్క్.. మహిళ తరహాలో జుట్టును కలిగి ఉన్నారు. చూసేందుకు అచ్చం ఆడ మనిషిలా కనిపిస్తున్న ఈ ఫొటో చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ ను రేకెత్తిస్తోంది. మరికొందరేమో మార్వెల్ సిరిస్ లో విలన్ థానోస్ ఫొటొలను షేర్ చేసిన యూజర్స్.. ట్విట్టర్ సీఈవోగా మస్క్ దిగిపోయిన వెంటనే.. అనే క్యాప్షన్ ను జోడిస్తూ.. చిటికెలు వేస్తున్నట్టుగా ఉన్న థానోస్ చిత్రాన్ని షేర్ చేశారు. మరొకరేమో ఇంకా కాస్త వెరైటీగా ఆలోచించి.. మాజీ ట్విట్టర్ సీఈవోగా ఫొటోలను కొలాగ్ చేసి షేర్ చేశారు. ఇంట్రడ్యూసింగ్ షెలాన్ మస్క్ అంటూ ఓ పక్క మస్క్.. మరో పక్క ఆడ వేషంలో ఉన్న మస్క్ ఫొటోను ఇంకొకరు షేర్ చేశారు. ఇలా చాలా రకాలైన పోస్టులను నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసేందుకు కాస్త వెరైటీగా, ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ గా ఉండడంతో వైరల్ అవుతున్నాయి.

https://twitter.com/tunguz/status/1656749321633558538

https://twitter.com/oldTomAF/status/1656820865412083712

https://twitter.com/cb_doge/status/1656751177193648156