డివైజ్ లేబుల్‌ను రిమూవ్ చేసిన ట్విట్టర్ అధినేత మస్క్

డివైజ్ లేబుల్‌ను రిమూవ్ చేసిన ట్విట్టర్ అధినేత మస్క్

రోజుకో వార్తకో నిత్యం ట్రెండింగ్ లో నిలుస్తోన్న ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్.. ఇప్పటికే ట్విట్టర్ లో చాలా మార్పులు చేశారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త నిర్ణయంతో చర్చనీయాంశంగా మారారు. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన ట్విట్టర్ లో మనం ఏ డివైజ్ నుంచి పోస్ట్ చేస్తున్నామో చూపే ట్యాగ్ ను తీసివేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ధృవీకరించారు. అంటే మనం ట్విట్టర్లో ఏదైనా పోస్ట్ చేసినపుడు చూపించే ట్వీట్ ఫర్ ఐఫోన్, ట్వీట్ ఫర్ ఆండ్రాయిడ్ అని చూపించే లేబుల్ ఇక కనిపించదన్నమాట.

దీనికి సంబంధించిన వార్తను చూపిస్తూ ప్యూబిటీ ఓ పోస్ట్ ను షేర్ చేసింది. మనం ఏ డివైజ్ నుంచి పోస్ట్ చేస్తున్నామో ఇక చూడలేమనే క్యాప్షన్ ను జత చేసింది. ఈ ట్వీట్ పై స్పందించిన ఎలాన్ మస్క్.. హల్లేలూయా అనే టైటిల్ తో రీట్వీట్ చేశారు. ఇటీవలే టెక్ జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలను మస్క్ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మస్క్ వెనక్కి తగ్గి, వాటిని మళ్లీ పునరుద్ధరించారు.