భారత్లో రెండు ఆఫీసులు మూసివేసిన ట్విట్టర్..!

భారత్లో రెండు ఆఫీసులు మూసివేసిన ట్విట్టర్..!

భారత్లో 90శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపిన ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఉన్న మూడు ఆఫీసుల్లో రెండింటిని క్లోజ్ చేసినట్లు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలోని ట్విట్టర్ ఆఫీసులను మూసివేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయా ఆఫీసుల్లో పనిచేస్తున్న  సిబ్బందికి వర్క్ ఫ్రం హోం ఇచ్చినట్లు సమాచారం. కాస్ట్ కట్టింగ్ లో భాగంగానే మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారని, అయితే ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఎక్కువగా ఉన్న బెంగళూరులోని ఆఫీసు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ట్విట్టర్కు భారత్లో 200ల మందికి పైగా ఉద్యోగులు ఉండగా గతేడాది నవంబర్ లో వారిలో 90శాతం మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. 2023 చివరి నాటికి ట్విట్టర్ ను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలని భావిస్తున్న ఎలాన్ మస్క్.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల్లో కోత విధించడంతో పాటు ఆఫీసులను మూసివేస్తున్నారు.