Twitter : 10వేల కంపెనీలకు బ్లూటిక్ ఫ్రీ

Twitter : 10వేల కంపెనీలకు బ్లూటిక్ ఫ్రీ

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరో కొత్త నిర్ణయంతో ముందుకొచ్చారు. అత్యధిక ఫాలోవర్లు ఉన్న 10వేల కంపెనీలకు బ్లూ టిక్ ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ కోసం గత కొన్ని రోజులుగా భారీగా మార్పులు, చేర్పులపై దృష్టి పెట్టిన మస్క్.. ఇటీవలే బ్లూ టిక్ సభ్యత్వాన్ని పొందేందుకు వెయ్యి డాలర్లు (సుమారు రూ. 82,000) చెల్లించాలని వెల్లడించారు. ఇప్పుడు తాజాగా చేసిన ప్రకటనతో.. ఈ 10వేల కంపెనీలు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ట్విట్టర్‌లో అత్యధికంగా ఖర్చు చేసే 500 మంది అడ్వర్టైజర్‌లు కూడా తమ బ్లూ టిక్ మార్క్‌ను ఉచితంగా పొందవచ్చని కూడా మస్క్ వెల్లడించారు.

బ్లూ టిక్ ఉన్న వారు మాత్రమే ట్వి్ట్టర్ లో కండక్ట్ చేసే పోల్స్ లో పాల్గొనడానికి అర్హులంటూ మస్క్ ఇటీవల ప్రకటించారు. ఇది ఏప్రిల్ 1నుంచి అందుబాటులోకి రానుందన్నారు. ఇంతముందు ట్విట్టర్ లో పోల్స్ పెడితే ఇప్పటివరకు ఎవరు పడితే వారు, ఎప్పుడంటే అప్పుడు ఓటు వేసేవారు. కానీ రీసెంట్ గా మస్చ్ చేసిన ప్రకటనతోక నుండి ఆ పద్దతికి కాలం చెల్లిపోయింది. కేవలం బ్లూ టిక్ ఉన్న ఖాతాల వారే ఓటెయ్యడానికి సాధ్యమవుతుంది. దాని కంటే ముందు బ్లూ టిక్ సభ్యత్వం పొందాలి. సభ్యత్వం పొందాలంటే ట్విట్టర్ సూచించిన నెలవారి లేదా వార్షిక చెల్లింపులు చేయాలి. ఆ తర్వాతే బ్లూ టిక్ వస్తుంది. ఇదంతా జరిగిన తర్వాతే ట్విట్టర్ పోల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది.

https://twitter.com/elonmusk/status/1641630535448510465