తాత్కాలికంగా ట్విట్టర్ ఆఫీసులు మూసివేత

తాత్కాలికంగా ట్విట్టర్ ఆఫీసులు మూసివేత

ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఆఫీసులను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ సిస్టమ్స్, కస్టమర్ల డేటాను రక్షించడానికి ఉద్యోగుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అందుకే ఆఫీసుల్లో ఉద్యోగుల యాక్సెస్ ను  కూడా బంద్ చేసినట్టు ఇవాళ ఇంటర్నెల్ మెమో జారీ చేశారు. ఇప్పటికే ఆఫీసులకు బయల్దేరితే.. ఇళ్ళకు వెళ్ళిపోవాలని మస్క్ ఉద్యోగులకు సూచించారు. దీనికి  సంబంధించి సంతకం చేయని ఓ ఇంటర్నల్ మెమో ఇవాళ విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా  ఎంప్లాయీస్ ని తగ్గిస్తున్నామని కూడా మెమోలో  తెలిపారు. ఎంతమందిని తొలగిస్తున్నారన్నది స్పష్టంగా చెప్పలేదు. కానీ తప్పించే వారికి  పర్సనల్ గా మెయిల్స్ పంపుతామని మెమోలో సూచించారు. ప్రతి ఒక్కరూ మెయిల్ చెక్ చేసుకోవాలనీ.. స్పామ్ ఫోల్డర్ కూడా చూసుకోవాలని కోరారు.

ట్విట్టర్ లో  రెవెన్యూ కన్నా  ఖర్చు ఎక్కువైందనీ... కాస్ట్ కటింగ్ తప్పదని కొనుగోలు చేసినప్పుడే ఎలాన్ మస్క్  చెప్పారు. ఇప్పటికే పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న అధికారులను తొలగించారు. అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్, HR  డివిజన్లలో పనిచేసే వారిని కూడా బయటకు పంపారు. చాలామంది ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టడానికి డిసైడ్ అయ్యారు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్, ఫ్రాంక్ వీడియోలు కూడా వచ్చాయి. అయితే ఎంప్లాయీస్ ని తగ్గించిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ని ప్రోత్సహించాలని ఎలాన్ మస్క్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. దాంతో ఆఫీసుల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని భావిస్తున్నారు. వారానికి 40 గంటల పాటు పనిచేయాలని కూడా ఎలాన్ మస్క్ ఆదేశాలిచ్చారు.