
ఆలస్యంగా అందిన ‘రైతుబంధు’
నారాయణ్‌ఖేడ్, వెలుగు: రెండున్నరేళ్ల క్రితం రైతు బంధు చెక్కును ఇప్పుడు రైతుకు అందించిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని ర్యాలమడుగులో జరిగింది. గ్రామానికి చెందిన దేవీసింగ్‌కు గ్రామ శివారులో రెండెకరాల భూమి ఉంది. నూతన పట్టాపాస్ పుస్తకం, రైతు బంధు చెక్కు ఇవ్వాలని రెండున్నరేళ్లుగా ఆఫీసర్ల చుట్టూ తిరిగినప్పటికీ అందలేదు. శనివారం వీఆర్ఏ మల్లయ్య 2018 మే 15న విడుదలైన రూ.10,500 రైతుబంధు ఆర్థిక సాయం చెక్కు, పాస్ పుస్తకాన్ని దేవీసింగ్‌కు అందించాడు. సాధారణంగా చెక్కు చెల్లుబాటు మూడు నెలలే ఉంటుంది. కానీ రెండున్నరేళ్ల క్రితం విడుదలైన రైతుబంధు చెక్కును ఆఫీసర్లు ఇప్పుడు ఇచ్చారని, ఈ డబ్బులు తనకు అందేలా చూడాలని రైతు కోరారు.
For More News..