నోట్లో బల్లి ... బాలుడు మృతి

 నోట్లో బల్లి ... బాలుడు మృతి

ఆ బాలుడికి రెండున్నరేళ్లు. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఎక్కవగా చిన్నారులు సహజంగా తెల్లవారుజామున నిద్రలో నుంచి లేస్తారు. ఆ బాలుడు కూడా అలాగే లేసి, మళ్లీ ఉదయం 8 గంటల సమయంలో పడుకున్నాడు. కానీ ఆ నిద్రలోనే శాస్వతంగా కన్నుమూశాడు. పడుకున్న సమయంలో ఆ బాలుడి నోట్లో బల్లిపడటమే ఈ మరణానికి కారణం. 

వివరాల్లోకి వెళ్తే...

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కోర్బా జిల్లాలో నోట్లో బల్లి పడటంతో రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఊహించని ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.  ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగిన్‌భాంఠా ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ సందేకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో అందరి కంటే చిన్నవాడు జగదీశ్. ఈ బాలుడి వయసు రెండున్నర ఏళ్లు. కాగా సోమవారం  ( జులై24)  బాలుడు మంచంపై పడుకుని ఆడుకుంటుండగా తల్లి ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటుంది.

ఈ క్రమంలో మధ్యలో ఒక సారి బాలుడిని చూసి వద్దామని వెళ్లింది. అయితే అతడి నోట్లో బల్లి పడి, చనిపోయి ఉండటం గమనించి ఒక్క సారిగా షాక్ అయ్యింది. బాలుడు కూడా అపస్మారకస్థితిలో ఉండటం చూసి రోదించడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు వినిపించడంతో స్థానికులు వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు.అయితే అప్పటికే జగదీశ్ మరణించి కనిపించాడు. అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపడుతున్నారుఅయితే బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదని జంతుశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ బలరాం కుర్రే స్పష్టం చేశారు. బల్లి శ్వాసకోశ నాళానికి అడ్డం పడటంతో ఊపిరాడక చిన్నారి మృతి చెంది ఉండొచ్చని చెప్పారు. పోస్టుమార్టం నివేదికలో ఏం జరిగిందనేది వెల్లడి కావచ్చని తెలిపారు. ఈ ఘటనా స్థానికంగా విషాదాన్ని నింపింది.