- పైసలిస్తే క్షణాల్లో అన్నీ రెడీ
- ఐటీ కారిడార్‌లో ఇద్దరు నిర్వాహకులు అరెస్ట్
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టైంది. ఈ కేసు వివరాలను మాదాపూర్ఏసీపీ శ్రీధర్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్హబిబుల్లాఖాన్కలిసి శనివారం వెల్లడించారు. హఫీజ్ పేటలోని ప్రేమ్‌నగర్‌కు చెందిన మహ్మద్ సాజీద్(37) గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని ఎస్బీఐ బ్యాంక్సమీపంలో శ్యామ్ జిరాక్స్‌సెంటర్ అండ్ ఫొటో స్టూడియో నడిపిస్తున్నాడు. సూర్యాపేట జిల్లా మోతే మండలం విభాలపురానికి చెందిన గంట్ల రాజీవ్‌గాంధీ(34) ఇదే జిరాక్స్సెంటర్లో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి ఈజీ మనీ కోసం నకిలీ సర్టిఫికెట్ల తయారీని మొదలుపెట్టారు. ఎస్ఎస్సీ మెమోల నుంచి పోలీస్‌వెరిఫికేషన్ సర్టిఫికెట్, నకిలీ థెరపీ, మెడికల్రిపోర్టులు, నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు, జాబ్ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు రెడీ చేసి అవసరం ఉన్న వారికి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.
వీరి దందాపై సమాచారం రావడంతో గచ్చిబౌలి, ఎస్వోటీ పోలీసులు కలసి దాడి చేశారు. వీరి నుంచి సర్టిఫికెట్లు పొందిన కిరణ్‌కుమార్, శరత్, చిరుగూరి రాజు, మురళీధర్, జెల్లా నరేశ్, పుష్పా, గౌతమ్, రజనీకాంత్, రాజేశ్ అదుపులోకి తీసుకొని విచారించారు. అనంతరం మహ్మద్సాజీద్, రాజీవ్‌గాంధీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక కంప్యూటర్, ప్రింటర్, 30 పోలీస్వెరిఫికేషన్సర్టిఫికెట్లు, మూడు చొప్పున ఎస్ఎస్సీ మెమోలు, థెరపీ సర్టిఫికేట్లు, ఓ హోమ్‌గార్డు ఐటీ కార్డు, బోనఫైడ్సర్టిఫికేట్, రెండు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులు, రెండు జాబ్ఎక్స్పీరియన్స్సర్టిఫికెట్లను స్వాధీనం చేసున్నారు.
