కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పన అధికారిగా మేక కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. కిరణ్కుమార్ గ్రూప్–1 ఫలితాల్లో విజయం సాధించి జిల్లా ఉపాధి కల్పన అధికారిగా నియమితులయ్యారు.
