వరద ప్రభావిత ప్రాంతాలను పునరుద్ధరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

వరద ప్రభావిత ప్రాంతాలను పునరుద్ధరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి 

దేవరకొండ, వెలుగు: గత నెల భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను పునరుద్ధరించేందుకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డితో కలిసి కొండమల్లేపల్లి మండలంలోని పెండ్లిపాకల, నక్కలగండి రిజర్వాయర్ల పరిసరాలను పరిశీలించారు. రిజర్వాయర్‌‌ సామర్థ్యం పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం 1204 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 

ఈ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ జిల్లాలోని ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  ఇరిగేషన్ ఎస్‌‌ఈ భద్రు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ, నాయక్, డీఈ రాములు, ఏఈఈ భాస్కర్‌‌రావు, శ్రవణ్, సతీష్ ఉన్నారు.

నల్గొండ అర్బన్, వెలుగు : పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై శనివారం ఆమె గృహనిర్మాణ శాఖ పీడి,ఆర్డీవోలు,  తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయ్యాయని , ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పారదర్శకంగా పంపిణీ చేయాలన్నారు. బుధవారం నాటికి లబ్ధిదారుల జాబితాలను రూపొందించాలని, శుక్రవారం లాటరీ ద్వారా ఎంపిక చేయాలన్నారు.