ప్రీస్కూల్ విధానంపై అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కార్యకర్తలకు శిక్షణ

ప్రీస్కూల్ విధానంపై అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కార్యకర్తలకు శిక్షణ

నిజామాబాద్ రూరల్, వెలుగు: నిజామాబాద్ మండలం గూపన్‌‌‌‌‌‌‌‌పల్లి గ్రామ శివారులోని వివేకానంద ధ్యాన మందిర ఆవరణలో అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కార్యకర్తలు, టీచర్లకు ప్రీ-స్కూల్ విధానంపై శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్​వో రాజశ్రీ, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి రసూల్‌‌‌‌‌‌‌‌బీ మాట్లాడుతూ బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్నారు. 

తల్లిపాల ప్రాముఖ్యత, ఎయిడ్స్ వ్యాప్తి, తీవ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ బడుల్లో ప్రవేశపెట్టనున్న ప్రీ-స్కూల్ విధానంపై వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్​వైజర్లు, సమన్వయకర్తలు  పాల్గొన్నారు.