
పాకిస్థాన్ తో సరిహద్దు ఉన్న జమ్మూ ప్రాంతంలో జరుగుతున్న ఉగ్రదాడుల కారణంగా ఇండియన్ ఆర్మీ అస్సాం రైఫిల్స్ కు చెందిన రెండు బెటాలియన్లను జమ్మూలో మోహరించింది. మణిపూర్, ఈశాన్య రాష్ట్రాల్లోని ఉన్న 2000 మంది అస్సాం రైఫిల్స్ బెటాలియన్ సైన్యం జమ్మూ ప్రాంతానికి తరలించారు. గత కొన్ని రోజులుగా జుమ్మూ కాశ్మీర్ లోని పాక్ సరిహద్దులో తరుచూ దాడులు జరుగుతున్నాయి.
ఆ దాడులను అణిచివేయడానికి పర్వత ప్రాంతాల్లో సర్వేవల్ అవుతూ.. శత్రువులను మట్టుబెట్టడంలో దిట్ట అయిన అస్సాం రైఫిల్ రిజిమెంట్లను పాక్ సరిహద్దులో దింపింది ఇండియన్ ఆర్మీ. వీరితో పాక్ ఉగ్రదాడులను తిప్పికొట్టనున్నారు. 2005 నుంచి 2021 వరకు శాంతియుతంగా ఉన్న జమ్మూ ప్రాంతంలో జూలైలో ఉగ్రదాడులు పెరిగడం గమనార్హం.