జైపూర్(భీమారం), వెలుగు: మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని కాలనీల్లో తాగు నీటి సమస్య పరిష్కారమైంది. రూ.4 లక్షలతో మంత్రి రెండు బోర్లు వేయించినట్లు కాంగ్రెస్ సీనియర్ లీడర్ పొడేటి రవి తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని బోగే వాడ, కుమ్మరి వాడలో తాగు నీటి సమస్య ఉందని సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లడంతో 2 బోర్లు మంజూరు చేశారని తెలిపారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో తాగు నీటి సమస్య పరిష్కారం కోసం మరిన్ని బోర్ వెల్స్ శాంక్షన్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తాగు నీటి సమస్య పరిష్కారమవడంతో కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ నాయక్, ఉష్కమల్ల శ్రీనివాస్, పున్నం చందు, కోల కిష్టయ్య, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
