
మేడ్చల్ జిల్లా, వెలుగు: హైదరాబాద్‌లో తండ్రిని ఫ్లైట్ ఎక్కించి ఇంటికి వెళ్తున్న అన్నదమ్ములు ఇద్దరూ రోడ్డు యాక్సిడెంట్లో అక్కడికక్కడే మృతి చెందారు. జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలం స్తంభంపల్లికి చెందిన శేరి అనంతి కొడుకు సుదర్శన్(32). అనంతి అన్న కొడుకు రాజేందర్(37). మంగళవారం అనంతి దుబాయ్ వెళ్తుండటంతో సుదర్శన్, రాజేందర్ వాళ్ల ఫ్రెండ్ వంశీతో కలసి తండ్రిని హైదరాబాద్ తీసుకెళ్లి ఫ్లైట్ ఎక్కించారు. తిరుగు ప్రయాణంలో వీరి కారు శామీర్‌పేట మండలంలోని లాల్మలక్పేట్ వద్ద ఆగి ఉన్న కంటెయినర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేందర్, సుదర్శన్ స్పాట్లోనే చనిపోయారు. వంశీకి రెండు కాళ్లు విరగడంతోపాటు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్ పేట సీఐ సుధీర్ తెలిపారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.