హైదరాబాద్ లో దారుణం.. ఫ్లైఓవర్ పిల్లర్ ను ఢికొన్న కారు.. ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ మృతి..

హైదరాబాద్ లో దారుణం.. ఫ్లైఓవర్ పిల్లర్ ను ఢికొన్న కారు.. ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ మృతి..

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మేడ్చెల్రంగారెడ్డి జిల్లా ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ పిల్లర్ నంబర్ 97 వద్ద జరిగింది. మౌలాలి నుంచి పోచారం వైపు 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులతో వెళ్తున్న కారు వేగంగా వచ్చి పిల్లర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

మృతులను సాయివరుణ్(23), నిఖిల్ (22)గా గుర్తించా రు. తీవ్రంగా గాయపడిన వెంకట్, రాకేశ్ ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తర లించారు. మిగిలిన విద్యార్థులు యశ్వంత్, సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ సాత్విక్ మాట్లాడుతూ.. మౌలాలికి వెళ్ళి వస్తూ, కొంతమంది స్నేహితులను పోచారం సద్భావన టౌన్షిప్ లో డ్రాప్ చేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని అన్నారు. బోడుప్పల్ నుండి మేడిపల్లి మీదుగా వెళ్ళే క్రమంలో పిల్లర్ నంబర్ 97 వద్ద ఇద్దరు బైకర్లను ఓవర్టేక్ చేస్తుండగా.. బైకర్ ను తప్పించబోయి కారు స్కిడ్ అయ్యి పిల్లర్ ను ఢికొట్టిందని అన్నారు. యువకుల మరణంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.