హైదరాబాద్ సిటీలో రెండు కార్లు ఢీ

హైదరాబాద్ సిటీలో రెండు కార్లు ఢీ

హైదరాబాద్ సిటీ నడిబొడ్డున అర్థరాత్రి రెండు కార్లు ఢీకొన్నాయి. మార్చి 15వ తేదీ బుధవారం అర్థరాత్రి.. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వంద అడుగుల రోడ్డులో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఓవర్ స్పీడ్ లో వెళుతున్న కార్లు.. అదుపు తప్పి ఢీకొన్నట్లు చెబుతున్నారు పోలీసులు. యాక్సిడెంట్ సమయంలో కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావటంతో ఎవరూ గాయపడలేదని.. ప్రాణాలతో బయటపడ్డారని పోలీసుల సమాచారం.

రెండు కార్లలోనూ యువతీ యువకులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే.. వారు కార్లలో నుంచి దిగి వెళ్లిపోయారు. ఇద్దరు యువతులకు మాత్రం స్వల్పంగా గాయాలు అయ్యాయని.. పెద్ద ప్రమాదం ఏమీ లేదంటున్నారు పోలీసులు. దెబ్బతిన్న కార్లను మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్లు ఢీకొన్న సమయంలో అందులోని యూత్.. మందు కొట్టి ఉన్నారా లేదా అనేది స్పష్టం చేయాల్సి ఉంది పోలీసులు. సిటీ నడిబొడ్డున.. రద్దీగా ఉండే ఏరియాలో అర్థరాత్రి రెండు కార్లు ఢీకొనటం చూస్తుంటే.. రేసింగ్ జరిగిందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

 దీనికి కారణం.. ఢీకొన్న కార్లు హైఎండ్ వెహికల్స్ కావటమే. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. కార్లలోని వారు ఎవరు.. ఏం చేస్తుంటారు.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు అనే వివరాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇద్దరు యువతులు స్వల్పంగా గాయపడినట్లు చెబుతున్న పోలీసులు.. వారి వివరాలు కూడా వెల్లడించాల్సి ఉంది.