వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి

రంగారెడ్డి జిల్లా: వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో దారుణం జరిగింది. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారుల మృతి కలకలం రేపుతోంది. డెలివరీ డేట్ ఇచ్చి... ఆ రోజు వస్తే డాక్టర్లు, సిబ్బంది పట్టించకోక పోవడంతోనే చిన్నారులు చనిపోయారని ఆరోపిస్తున్నారు బంధువులు. డెలివరీ డేట్ ఇచ్చిన రోజు వస్తే డాక్టర్లు సీరియస్ గా ఉందని చెప్తూ కోఠి ఆస్పత్రికి పంపుతున్నారని చెప్తున్నారు. హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.