ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

అప్పటిదాక కళ్లముందే తిరిగిన పిల్లలు ఇకలేరని తెలియగానే ఆ తల్లిదండ్రులు కుప్పకూలారు. సోమవారం మధ్యాహ్నం కాగజ్ నగర్ పట్టణ సమీపంలోని పెద్దవాగు ఎస్పీఎం పంపు హౌజ్ లో ఈతకు వెళ్లిన ఇద్దరు పిల్లలు నీట మునిగి చనిపోయారు. మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. స్థానిక సీ బాబు కాలనీకి చెందిన గనీబాబా , ఇప్ప సాగర్ , బొమ్మన శ్రావణ్ ,గోగర్ల రూపేశ్‌ సోమవారం మధ్యాహ్నం సరదాగా పంపుహౌజ్ వద్దకు వెళ్లారు .ఈత కొట్టేందుకు నీటిలోదిగారు. వీరిలో గనీబాబా(13), శ్రావణ్ (14)లునీటిలో మునిగిపోయారు. ఇప్ప సాగర్ , రుపేష్ మునిగిపోతూ కేకలు వేయడంతో అక్కడే పడవ నడుపుతున్న జాలర్లు వారిద్దరినీ బయటకు లాగారు. మిగతా ఇద్దరికోసం గాలించగా గనీబాబా శవం దొరికింది.శ్రావణ్ కోసం గజ ఈతగాళ్లు ఇంకా గాలిస్తున్నారు.గనీబాబా, శ్రావణ్‌ కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు . గనీబాబాకు తల్లిలేదు. అవిటివాడైన తండ్రి షేక్ హైమద్​ కొ డుకు మరణాన్ని తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. శ్రావణ్ ఆచూకీ కూడా దొరకకపోవడంతో అతని తల్లిదండ్రులు ఏడుస్తున్నతీరు అందరినీ కంటతడి పెట్టించింది.కాగజ్ నగర్ టౌన్‌ సీఐ కిరణ్ , రూరల్‌ ఎస్సై ఎన్ .రాజ్కుమార్ కేసు నమోదు చేసి, గనీబాబా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిర్పూర్ కమ్యూనిటీ హాస్పిటల్‌కు తరలించారు.